News

‘పబ్లిక్ నమాజ్‌’ ను వ్య‌తిరేకించిన హిందువుల అరెస్టు

730views

గురుగ్రామ్‌: బ‌హిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల సభ్యులు మరోసారి నిరసనను ప్రారంభించవలసి వచ్చింది.

శుక్రవారం నమాజ్ చేయడానికి పబ్లిక్ గ్రౌండ్‌కు చేరుకున్న ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ‘జై శ్రీరామ్’, ‘వందే మాత్రం’ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గురుగ్రామ్ పోలీసులు, ముస్లింలను బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని ఆపడానికి బదులుగా హిందువులను అక్కడి నుండి నెట్టివేశారు. ముస్లింలు నమాజ్‌ను అడ్డుకోకుండా నిరసనకారులను దూరంగా ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఆ ప్రదేశంలో నమాజ్ నిర్వహించకూడదని ముస్లింలకు తెలియజేయడానికి కొన్ని హిందూ సంస్థలకు చెందిన సభ్యులు ముస్లింలను సంప్రదించినప్పుడు, గురుగ్రామ్ పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని ఖాన్‌స్డా గ్రామంలో ఉన్న ఈ మైదానం వాణిజ్య వాహనాలను పార్కింగ్ చేయడానికి క్రమం తప్పకుండా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు చాలా మంది నిరసనకారులు తమ ట్రక్కులను పార్కింగ్ చేసి నిరసన తెలియజేశారని నివేదించాయి. గురుగ్రామ్ పోలీసులు ఈ శుక్రవారం సెక్టార్ 37లో ముస్లింలను నమాజ్ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించిన దాదాపు 50 మందిని హిందువులను అదుపులోకి తీసుకున్నారని తెలిపాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి