News

నన్ను కొట్టి, హత్య చేసేవారు…

351views
  • కంగనా రనౌత్‌ ఆరోపణ

కిరాత్‌పూర్‌ సాహిబ్‌: కిరాత్‌పూర్‌ సాహిబ్‌ పట్టణంలో నిరసన తెలుపుతున్న రైతులు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కారును ఆపి, చుట్టుముట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె ఆ పరిస్థితులను ఇన్‌స్టాగ్రాంలో వివరించింది. స్వస్థలమైన హిమాచల్‌ ప్రదేశ్‌ నుండి పంజాబ్‌ చేరుకోగానే తన కాన్వాయ్‌పై రైతు నిరసనకారుల గుంపు మెరుపుదాడి చేసింది.. ‘నన్ను ఒక గుంపు చుట్టుముట్టింది. తమను తాము రైతులుగా పిలుచుకుంటున్నారు. వారు నాపై దాడి చేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు’అని ఆమె విలపించింది.

‘అక్కడ పరిస్థితి నమ్మశక్యం కాదు. ఇక్కడ ఎక్కువ మంది పోలీసులు ఉన్నప్పటికీ నా వాహనం ఆగిపోయింది. నేను రాజకీయ నాయకుడా? నేను పార్టీని నడుపుతానా? ఈ ప్రవర్తన ఏమిటి? నా పేరుతో చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయ ఎత్తుగడకు ప్రత్యక్ష పర్యవసానమే గుంపు దాడి. మీరు గమనిస్తే, నన్ను అన్ని వైపుల నుండి గుంపు చుట్టుముట్టింది. పోలీసులు లేకుంటే, నన్ను కొట్టి చంపి ఉండేవారు’ అని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, ఆ తర్వాత ఆమె గుంపు నుండి తప్పించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత పంజాబ్‌ పోలీసులకు ధన్యావాదాలు తెలిపింది. ‘నేను సురక్షితంగా ఉన్నాను. ఆ అస్థిరమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని ఆమె అన్నారు. ‘నన్ను ఎవరూ క్షమాపణలు అడగలేదు.. నేను ఎవరికీ చెప్పలేదు… నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, దేనికి? పంజాబ్‌ ప్రజల పట్ల నిజమైన ప్రేమ, శ్రద్ధ కోసమా? లేదు, నేను ఎప్పటికీ అలా చేయను… దయచేసి పుకార్లు వ్యాప్తి చేయవద్దు. నేను ఎల్లప్పుడూ రైతులకు మద్దతునిస్తాను, రైతుల బిల్లుకు అనుకూలంగా మాట్లాడాను… నేను దానిని కొనసాగిస్తాను’ అని ఆమె పేర్కొంది.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి