
424views
-
కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం సాయంత్రం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 1.97లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే.. 4,000కు మందికిపైగా బద్రీనాథుడి దర్శనం కోసం వచ్చారని చెప్పారు. ఛార్‌ధామ్‌లో భాగమైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇప్పటికే మూసివేశారు.





