
341views
న్యూఢిల్లీ: దేశంలో మారుమూల ప్రాంతాల్లో రూ.33,822 కోట్ల వ్యయంతో.. 32,152 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గిరిజన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అడవులు, పర్వతాలు, నదుల మీదుగా ఈ రోడ్ల నిర్మాణం ఉంటుంది.
మరోవైపు, గిరిజన ప్రాంతాల్లోని 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు ఏర్పాటుకు సుమారు రూ. 6,466 కోట్లను వెచ్చించనుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా 42 జిల్లాల్లో 4జీ సేవలతో టెలికాం కనెక్టివిటీ మెరుగుపడనుంది.





