News

తొలిసారిగా క్రీడ ఇన్‌స్టిట్యూట్ పురస్కారాల ప్ర‌దానం

479views

న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్​).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి ఇన్​స్టిట్యూషనల్​ పురస్కారాల‌ను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్​లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది. ఈ కార్యక్రమానికి భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ హాజరయ్యారు. 2016 నుంచి గతేడాది వరకు ఆటల్లో మంచి ఫలితాలు కనబరిచిన అథ్లెట్లకు, కోచ్​లకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యత్తమ, ఉత్తమ పురస్కారాలు అనే రెండు జాబితాల్లో పురస్కారాలు ఇచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి