News

భర్తను నక్సల్స్ చెర నుంచి విడిపించుకున్న భార్య

598views
  • అభినవ సావిత్రిగా కితాబు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించిన ఆయన భార్య స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయంతో రెండేళ్ల బిడ్డను తీసుకుని, కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి, మావోయిస్టులను చేరుకుంది.

భర్త, బిడ్డ తప్ప తనకు మరో దిక్కులేదని, అజయ్‌ ఏదైనా తప్పు చేస్తే పెద్దమనసుతో క్షమించాలని ప్రాధేయపడింది. సామాజికవేత్తలు సైతం అర్పిత పరిస్థితిని మావోయిస్టులకు వివరించారని తెలిసింది. అర్పిత విన్నపం మావోయిస్టుల హృదయాలను కదిలించింది. బీజాపూర్‌లో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు చివరకు ఇంజినీర్‌ అజయ్‌ను విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి