
497views
-
భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీతో ప్రారంభం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ఇవి ప్రారంభమవుతాయి. జులై 29న ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20ల రూపంలో తొలిసారి మహిళల క్రికెట్ ను కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెడుతున్నారు. చివరిగా 1998లో ఈ క్రీడల్లో క్రికెట్ ఆడారు. తొలి రోజు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్-బార్బడోస్ పోరు కూడా జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జులై 31న భారత్ తలపడబోతోంది. ఈ టోర్నీలో ఆడే ఎనిమిది క్వాలిఫయింగ్ జట్లలో ఇప్పటికే ఏడు జట్లు ఖరారు కాగా.. చివరి జట్టు ఇంకా తేలాల్సి ఉంది.



