News

బీజాపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కిడ్నాప్

493views

బీజాపూర్‌: ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎమ్​జీఎస్​వై) పథకం కింద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. బీజాపూర్​లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్​, అటెండర్​ను మావోయిస్టులు కిడ్నాప్‌​ చేశారు. అజయ్ రోషన్ లక్రా(36), లక్ష్మణ్ పర్తగిరి(26) పీఎంజీఎస్​వై కింద సబ్​ ఇంజినీర్, అటెండర్​గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. వారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోలు అందులో అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని గురువారం సాయంత్రం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి