News

యూపీలో బాంబు దాడులు చేస్తాం

556views
  • తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరిక

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా ప్రధాన పట్టణాలైన వారణాసి తదితర స్టేషన్లు ఉన్నాయి. దీపావళి పండగ నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ఈ లేఖ అందడం యూపీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాద సంస్థకు చెందిన స్థానిక కమాండర్​ ఈ లేఖను పంపించినట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా నుంచి వచ్చిన ఈ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు.. రైల్వే శాఖ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. లఖ్​నవూలోని ఛార్​బాఘ్​ రైల్వే స్టేషన్​ సహా లఖ్​నవూ జంక్షన్​లో జీఆర్​పీ, ఆర్​పీఎఫ్​ బృందాలు నిఘాను కట్టుదిట్టం చేశాయి. రైళ్లలో తనిఖీలను ముమ్మరం చేసిన‌ట్టు అధికారులు వెల్లడించారు. రాత్రిపూట రాకపోకలు జరిపే రైళ్లపైన ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి