
-
స్మగ్లర్‌ను పట్టుకున్న పోలీసులు
పంజాబ్: పాకిస్తాన్ నుండి హెరాయిన్, ఇతర మాదకద్రవ్యాలు భారతదేశానికి స్మగ్లింగ్ కావడం కొత్త విషయం కానప్పటికీ, ఈసారి సరికొత్త సంఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన ఆసుపత్రి పేరు సరిహద్దుల వెంబడి భారతదేశానికి తరలిస్తున్న హెరాయిన్ ప్యాకెట్లపై రాసివుంది. ఇందుకు కారకుడైన పాకిస్థాన్ స్మగ్లర్‌ని శనివారం అర్ధరాత్రి బిఎస్‌ఎఫ్ పట్టుకుంది. నిందితుడిని నుంచి ఆరు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ స్మగ్లర్‌ను అమృత్ సర్ గ్రామమైన రజతల్ సమీపంలో అరెస్టు చేశారు. లాహోర్‌లోని షౌకత్ ఖనుమ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి పేరును హెరాయిన్ ప్యాకెట్‌పై రాశారు. షౌకత్ ఖనుమ్ అనేది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తల్లి పేరు. బీఎస్‌ఎఫ్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం… తెల్లవారుజామున 4:30 గంటలకు, రాజతల్ సమీపంలో ముళ్లతీగలో కదలిక వచ్చింది, తర్వాత కాల్పులు జరిగాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ స్మగ్లర్‌ను అరెస్టు చేశారు.
నీచమైన పొరుగుదేశం పాకిస్తాన్… పంజాబ్ దరి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా హెరాయిన్, ఆయుధాలను పంపడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి అమృత్‌సర్, తార్న్ తరణ్ సరిహద్దులో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దు దాటి నుండి భారత భూభాగంలోకి ఆయుధాలు, హెరాయిన్ ఉగ్రవాదులు విసిరితున్నాడు. ఇటీవల, పంజాబ్ పోలీసులు చర్య తీసుకుంటున్నప్పుడు, అనేక మంది ఉగ్రవాదులతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా సంస్థలు, పోలీసుల దర్యాప్తులో పాకిస్తాన్ ఇక్కడి గల ఖలిస్తానీ ఉగ్రవాదులను ఉపయోగించి భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు తేలింది. ఇటీవల, పంజాబ్ పోలీసులు జలంధర్, అమృత్‌సర్, తార్న్ తరణ్‌లలో దాడులు చేసి అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి నుంచి టిఫిన్ బాంబు, ఆర్‌డిఎక్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ చీఫ్ లఖ్‌బీర్ సింగ్ రోడ్ ఆదేశాల మేరకు పాకిస్థాన్ ఈ తీవ్రవాద ఘటనలను పూర్తి చేసే పనిలో ఉంది. దీని కోసం, అతను తన మేనల్లుడు గురుముఖ్ సింగ్ రోడ్‌ని మొత్తం నెట్‌వర్క్‌ను సిద్ధం చేయమని ఆదేశించాడు. అయితే, పంజాబ్ పోలీసులు అతడిని జలంధర్ నుండి దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో దేశానికి ఆపదలు తప్పాయి.
Source: panchjanya





