News

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం!

678views

జ‌మ్మూ-క‌శ్మీర్‌: జమ్మూ- క‌శ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మ‌య్యాడు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొన‌సాగుతోంది… పోలీసులు, భద్రతా దళాలు చీడ‌పురుగుల‌ ఏరివేతలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియజేస్తాము” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

రఖామా ప్రాంతంలో భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దర్యాప్తు అనంతరం ఉగ్రవాది వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల తర్వాత, పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ చేస్తున్న అదే ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి