News

10 మంది నేవీ సిబ్బంది అదృశ్యం!

684views

ఉత్తరాఖండ్‌: త్రిశూల్‌ శిఖరం సమీపంలో మంచుకొండలు కూలిపోయాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో పది మంది నేవీ సిబ్బంది అదృశ్యమయ్యారు. వీరి అచూకీ కోసం ప్రభుత్వం సహాయక బృందాన్ని హుటాహుటిన పంపింది. ఉత్తరకాశీలోని త్రిశూల్‌ శిఖరం సమీపంలో హిమపాతం సంభవించిన తర్వాత పది మంది జవాన్లు గల్లంతయ్యారు. వీరందరూ 15 రోజుల క్రితం త్రిశూల్‌పైకి బయలుదేరిన నేవీ సైనికులు.

అందిన సమాచారం ప్రకారం… త్రిశూల్‌ పర్వతం 7,120 మీటర్లు. ఈ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి 15 మంది నౌకాదళ సభ్యుల బృందం వెళ్లింది. శుక్రవారం ఉదయం సంభవించిన హిమపాతం కారణంగా పది జవాన్లు గల్లంతయ్యారు. మిగిలిన అయిదుగురు సురక్షితంగా బయటపడి, ఘటన సమాచారాన్ని అధికారులకు తెలిపారు. దీంతో నెహ్రూ పర్వతారోహణ సంస్థ ప్రిన్సిపాల్‌ అమిత్‌ బిష్త్‌ రెస్క్యూ బృందంతో త్రిశూల్‌ బేస్‌ క్యాంప్‌కు బయలుదేరారు. ఆర్మీ, ఐటీబీపీ బృందాలు ప్రమాద స్థలికి బయలుదేరివెళ్ళాయి. హెలికాప్టర్‌తో కూడా గాలిస్తున్నారు.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి