News

పాకిస్థాన్‌లో 12 భయంకరమైన ఉగ్రముఠాలు!

676views
  • అగ్రరాజ్యం అమెరికా వెల్లడి

వైట్‌హౌస్‌: పాకిస్థాన్‌లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నాయి. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా తన నివేదికలో వెల్లడైంది. వారం కిందట అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్వాడ్‌ దేశాల సమావేశం సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌కు చెందిన స్వతంత్ర కాంగ్రెస్‌ రీసెర్చ్‌ (సీఆర్‌ఎస్‌) విభాగం ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్‌, లష్కర్‌ ఏ తైబా సహా మొత్తం 12 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.

‘పాకిస్థాన్‌లోని ఉగ్రవాద, ఇతర మిలిటెంట్‌ ముఠాలు’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలను పరిశోధకులు వెల్లడిరచారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 1980వ సంవత్సంలో ఏర్పడగా, 2001లో ఎఫ్టీవో అనే విదేశీ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.

అల్‌ ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌-ఖోరాసన్‌ ప్రావిన్స్‌, ఆఫ్ఘన్‌ తాలిబాన్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తెహ్రిక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌, బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, జుందల్లా (అకా జైష్‌ అల్‌-అడ్ల్‌), సిపా-ఇ-సహబా పాకిస్థాన్‌, లష్కరే-జాంగ్వి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాయని అమెరికా తాజా నివేదికలో వెల్లడైంది.

పాక్‌లోని ఉగ్రవాద ముఠాలను ఐదు రకాలుగా విభజించారు. ప్రపంచం మొత్తానికి సంబంధించినవి, ఆఫ్ఘనిస్థాన్‌కే పరిమితమైనవి, భారత్‌-కశ్మీర్‌కు పరిమితమైనవి, స్వదేశీ పరిమితమైనవి, యాంటీ షియా ముఠాలు. 1980లో ఏర్పడిన ‘లష్కర్‌ ఏ తైబా’ ఉగ్రవాద ముఠాను 2001లో ఫారెన్‌ టెర్రరిస్టు సంస్థ (ఎఫ్‌టీవో)గా గుర్తించినట్టు ఈ నివేదిక వెల్లడిరచింది. ఈ సంస్థ 2008లో ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు సీఆర్‌ఎస్‌ తెలిపింది.

2001లో కశ్మీరీ ఉగ్రవాద నాయకుడు మసూద్‌ అజహర్‌ స్థాపించిన జైష్‌-ఏ-మహమ్మద్‌ సంస్థ కూడా 2001లో ఎఫ్‌టీవో జాబితాలో చేరిందని వెల్లడిరచింది. ఈ సంస్థ 2001 భారత పార్లమెంటుపై దాడుల్లో కీలక పాత్ర పోషించింది. జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ బహిరంగంగానే అమెరికాపై యుద్ధం ప్రకటించిన విషయాన్ని ఈ నివేదికలో ప్రస్తావించారు.

ఈ రెండిరటితోపాటు హరకత్‌-ఉల్‌ జిహాద్‌ ఇస్లామీ (హుజీ) అనే ఉగ్రవాద ముఠాను కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఈ ముఠా బలం ఎంతనే విషయం ప్రస్తుతం ఎవరికీ తెలియదని సీఆర్‌ఎస్‌ పేర్కొంది. 1980లో స్థాపించిన ఈ సంస్థను 2010లో ఎఫ్‌టీవో జాబితాలో చేర్చారు.

ఈ ముఠా నెమ్మదిగా భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లో కూడా వ్యాపించినట్టు నివేదిక చెప్తోంది. కశ్మీర్‌ను ఎలాగైనా పాక్‌లో కలపాలని ఈ ఉగ్రవాద ముఠా పనిచేస్తోంది. 1989లో ఏర్పడిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కూడా 2017లో ఎఫ్‌టీవో జాబితాలో చేరింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాల్లో ఆల్‌ఖైదా కూడా ఉందని, ఈ ముఠా దేశంలోని వివిధ వర్గాలతో మంచి సంబంధాలు కలిగి ఉందని సీఆర్‌ఎస్‌ రిపోర్టు తెలిపింది.

మొత్తానికి భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి దేశాలను టార్గెట్‌ చేస్తున్న ఉగ్రముఠాలకు పాకిస్థాన్‌ ఆశ్రయమిస్తునట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2015లో చేసిన నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌లోని కీలక అంశాలపై ఈ దేశం సరిగా పనిచేయడం లేదని సీఆర్‌ఎస్‌ పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌, భారత దేశాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రముఠాలపై పాకిస్థాన్‌ చర్యలు కరువయ్యాయని ఆరోపించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి