News

కింగ్‌ మిహిర్‌ భోజ్‌ శిలాఫలకానికి నల్లరంగు!

731views
  • కేసు నమోదు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలోని ఒక కళాశాలలో నిన్న మంగళవారం కింగ్‌ మిహిర్‌ భోజ్‌ విగ్రహం క్రింద ఏర్పాటు చేసిన శిలాఫలకానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లని రంగు పూశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాద్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ చర్యకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

‘స్థానిక కళాశాలలోని రాజు మిహిర్‌ భోజ్‌ విగ్రహం క్రింద ఉన్న శిలాఫలకంపై నల్లని రంగు పూసినందుకు దుర్మార్గులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడిరది. ఈ మేరకు గురజర్‌ విద్యా సభ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వైరల్‌ వీడియోను మేము గుర్తించాము’’ అని గౌతమ్‌ బుద్ధ నగర్‌, అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ విశాల్‌ పాండే అన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి