
న్యూఢిల్లీ: భారత్తో భాగస్వామ్యం కోసం అమెరికా ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధినేత నిశా బిస్వాల్ అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపైప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆచరణాత్మకమైన నేతలని కొనియాడారు.
అమెరికా ఛాంబర్లో జరిగిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో .. సరికొత్త సాంకేతిక అవకాశాలు, ఆర్థిక సాయం, భారత్ క్లీన్ ఇన్ఫ్రాలో పెట్టుబడుల అంశాలపై చర్చించినట్టు చెప్పారు నిశా. మోదీ, బైడెన్లు ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంపై ఎలా వ్యవహరిస్తారనే దానిపై వాణిజ్య సహకారం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈవారం చివర్లో చేపట్టనున్న మోదీ అమెరికా పర్యటనపైనా పలు విషయాలు వెల్లడించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





