News

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా దిల్సుఖ్‌నగర్‌లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ భారీ నిరసన

42views

విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ పాల్గొని ప్రసంగించారు.

లవ్ జిహాద్ అనేది హిందూ సమాజంపై ముస్లిం మతోన్మాదులు సాగిస్తున్న ఒక ప్రమాదకరమైన విషక్రీడ అని డాక్టర్ శశిధర్ విమర్శించారు.

దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబం తమ ఆడపిల్లల రక్షణపై దృష్టి సారించాలని, దేవాలయాలు ఈ సామాజిక బాధ్యతను స్వీకరించి సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో వెలుగుచూసిన కార్పొరేట్ జిహాద్ వ్యవహారం, అమరావతి (మహారాష్ట్ర) సంఘటనలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో వేలాది మంది హిందూ అమ్మాయిలు అదృశ్యం కావడం వెనుక లవ్ జిహాద్ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తూ, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, జిల్లా సహ కార్యదర్శి సంజయ్ శర్మ, నాయకులు సాయిరాం, సుధీర్, మరియు మాతృశక్తి ప్రతినిధి లతాశ్రీ తదితరులు పాల్గొన్నారు.