
401views
-
దేశంలోనే తొలిసారని వెల్లడించిన రక్షణ వర్గాలు
ఉత్తరాఖండ్: సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారిని ఆఫీసర్ కమాండింగ్‌గా నియమించినట్టు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్సీసీ)కు ఈ అధికారిని నియమించినట్టు తెలిపింది. మేజర్ ఆయినా సారథ్యంలో కెప్టెన్ అంజనా, భావన జోషి, విష్ణుమయ కే.లకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది.
ఆగస్టు 30నే ఈ అధికారుల నియామకం ఖరారు కాగా.. ఈ ఏడాదిలో మహిళా అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను మరోసారి విడుదల చేసింది బీఆర్ఓ. బీఆర్ఓ తమ సంస్థలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం కల్పిస్తోందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫీసర్ల నుంచి కమర్షియల్ పైలట్ లైసన్స్ హోల్డర్స్ వరకు చాలా మందిని నియమిస్తోందని స్పష్టం చేసింది.





