
395views
-
నేటి అర్ధరాత్రి నుంచి అమలు
తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఈ అర్థరాత్రి నుంచి తితిదే పెంచింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయబోతోంది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ దర్శన సమయంను పెంచింది. రాత్రి 12 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించనున్న నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
కరోనా కారణంగా గతేడాది లాక్ డౌన్ నుండి రాత్రి 9 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తూ వస్తున్నారు టీటీడీ అధికారులు. అంతేకాదు.. ఇప్పటి వరకు చిత్తూరు వాసులకు మాత్రమే పరిమితం చేసిన సర్వదర్శనం టికెట్లను.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు భక్తులకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టొకెన్లను జారీ చేస్తున్నట్టు టీటీడీ బోర్డు తెలిపింది.





