
506views
-
కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ జిల్లాలో దుర్ఘటన
చిక్‌బల్లాపూర్: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కూలీలంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
Source: Andharaprabha





