కశ్మీర్ వేర్పాటువాది భౌతిక కాయంపై పాక్ జెండా, భారత వ్యతిరేక నినాదాలు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు..

463views
జమ్ముకశ్మీర్లో బుధవారం మృతిచెందిన పాకిస్థాన్ అనుకూల ఏర్పాటువాద నేత సయ్యద్ అలి షా గిలానీ మృతదేహంపై పాక్ జాతీయ జెండా కప్పినందుకు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులు వెల్లడించారు. పొరుగు దేశం జెండా భౌతికకాయంపై కప్పడం, భారత వ్యతిరేక నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది.





