
గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యునెస్కో తాజా ప్రకటన అనంతరం గుజరాత్ లోని ప్రపంచ వారసత్వ స్థలాల సంఖ్య మూడుకు పెరిగింది. పావ్ గఢ్ సమీపంలోని చంపానీర్, చారిత్రక అహ్మదాబాద్ నగరం ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ స్థలాలుగా యునెస్కో జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ధోలావీరా నగరం కూడా వీటి సరసన చేరింది. ‘‘బ్రేకింగ్! ధోలావీరా: భారత్‌లో ఉన్న హరప్పా నాగరికత నాటి సిటీని ప్రపంచ వారసత్వ ప్రాంతాల లిస్ట్‌లో చేర్చాం. కంగ్రాట్స్” అంటూ మంగళవారం యునెస్కో తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రధాని మోడీ హర్షం
Absolutely delighted by this news.
Dholavira was an important urban centre and is one of our most important linkages with our past. It is a must visit, especially for those interested in history, culture and archaeology. https://t.co/XkLK6NlmXx pic.twitter.com/4Jo6a3YVro
— Narendra Modi (@narendramodi) July 27, 2021

ధోలావీరాకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సొంత రాష్ట్రం గుజరాత్ లోని ఓ చారిత్రక నగరానికి విశిష్ట గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని అన్నారు. ధోలావీరా ఓ ముఖ్యమైన నాగరికత కేంద్రమని, చరిత్రతో మనకున్న గొప్ప అనుసంధానం ఈ నగరం అని వివరించారు. చరిత్ర, సంస్కృతి, పురావస్తు అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్లు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రాంతమని అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ధోలావీరాలో పర్యటించానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ధోలావీరాలోని ప్రాచీన నిర్మాణాల
పరిరక్షణకు కృషి చేశానని తెలిపారు.
హరప్పా నాగరికతకు సాక్ష్యం ధోలావీరా
ధోలావీరా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. హరప్పా నాగరికతకు సాక్ష్యం ఈ నగరం. భారత్‌లో క్రీస్తు పూర్వం దాదాపు 3 వేల ఏండ్ల క్రితమే ఎంతో అద్భుతమైన నాగరికత, నగరాలు ఉండేవనేందుకు ధోలావీరాలోని శిథిలాలు సాక్ష్యంగా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2 వేల 650 నుంచి 2 వేల 550 వరకు హరప్పా నాగరికత ఇక్కడ నడిచిందని చెబుతుంటారు. వరుస కరవు కాటకాల వల్ల క్రీస్తు పూర్వం 1900 సంవత్సరం నుంచి 1850 మధ్య పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోయిందని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. నాటి చరిత్రకు సంబంధించిన శిధిలాలను 1967–68 మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పట్లో డైరెక్టర్ జనరల్‌గా ఉన్న జేపీ జోషి తొలిసారి గుర్తించారు. హరప్పా నాగరికతలో ధోలావీరా ఐదో అతి పెద్ద నగరం. 1990 నుంచి ఆర్కియాలజీ వాళ్లు ఇక్కడ తవ్వకాలు జరిపారు.
ధోలావీరాకు వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తన ట్విట్టర్ లో తెలిపారు. ధోలావీరా ఇప్పుడు భారత్ లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని.. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో భారత్ సూపర్ పార్టీ క్లబ్ లో చేరిందని అన్నారు. 2014 నుంచి భారత్ లో కొత్తగా 10 ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయని.. ప్రధాని మోదీ కమిట్ మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ సంస్కృతి, పౌరసత్వం, జీవన విధానాన్ని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న తీరును కిషన్ రెడ్డి ప్రశంసించారు.
Source : Nationalist Hub





