News

ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి

732views

త్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా అగుడోంగ్రీ – పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నేతలు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం వచ్చింది. సీఆర్‌పీఎఫ్‌, డీఆర్జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో తారసపడిన మావోయిస్టులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు జన మిలీషియా కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు. తుపాకులు, టిఫిన్‌ బాంబులు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, బీమాపై గతంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.లక్ష రివార్డు ప్రకటించిందని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.