News

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

633views

ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్ లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం ఖచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.