
విశాఖపట్నంలోని స్థానిక నర్శింగరావు పేటలోని ఏపీటీఎఫ్ భవనంలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ రేబాక రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కొనపల్లి సత్యనారాయణ నిర్వహించారు. హిందూ బౌద్ధ మతాలకు చెందిన దళితులపై జరుగుతున్న దాడులను ఈ సమావేశంలో ప్రతినిధులందరూ ముక్తకంఠంతో ఖండించారు. అలాగే క్రైస్తవ మత సాంప్రదాయాలను ఆచరిస్తూ హిందూ SC లుగా చెలామణి అవుతున్న వారిపై పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా హిందూ షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హిందూ షెడ్యూల్డ్ కులాల హక్కుల వేదిక అధ్యక్షులుగా శ్రీ రేబాక రామారావును, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శ్రీ కొనపల్లి సత్యనారాయణను ఎన్నుకున్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ షెడ్యూల్డ్ కులాల ఎస్,సి ఎస్టీ హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దూలం బూసి రాజు, బిజెపి ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ నడిపూడి వేణుగోపాలరావు, హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ బోని గణేష్ మరియు వివిధ హిందూ దళిత సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే కమిటీ కార్యాచరణను ప్రకటిస్తామని కూడా ఈ నేతలు వెల్లడించారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ సింహాద్రి శీను, శ్రీ కొత్తపల్లి శ్రీనివాస రావు, శ్రీ మైలపల్లి పోతురాజు, శ్రీమతి రేబాక మణి మాలతి, శ్రీ అంగులూరి ఈశ్వరరావు, శ్రీ నడిపూడి భాస్కర్, శ్రీ పావడ సన్యాసిరావు, శ్రీ ఎలకల భాస్కర్, శ్రీ బండి అప్పారావు, శ్రీ తోత్తర అప్పారావు, శ్రీ సింగంపల్లి శ్రీనివాస రావు, శ్రీ తోత్తర నూకరాజు, ఉడతా రాముడు, పి జానకి మరి కొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.





