
తెనాలి పరీక్ష”. నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని మోదీ కూడా. స్పందించేంతటి ప్రాముఖ్యం దానికి ఎందుకొచ్చింది?… వంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి.
దేవభాష సంస్కృతంలో ఘనాపాటీలను తీర్చిదిద్దేందుకు మూడు దశాబ్దాల క్రితం తెనాలిలో నెలకొల్పిన ‘సుధర్మ రక్షణ పరిషత్’ గురించి తెలుసుకుంటే ఈ సందేహాలన్నీ తీరినట్లే సనాతన ధర్మానికి మూ మైన వేదాన్ని, వేద ప్రమాణాన్ని నిలబెట్టేది శాస్త్రం, సత్యం, జ్ఞానం, దర్మాల గురించి తెలుపుతూ యజ్ఞ యాగాది క్రతువులను వివరించే ఆ శాస్త్రంతోనే సనా తన ధర్మాన్ని కాపాడేందుకు ‘సుధర్మ రక్షణ పరిషత్’ను బ్రహ్మశ్రీ వేదాంత భాగవతుల ఆంజనేయశర్మ 1989లో గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీవారి సన్నిది ప్రాంగణంలో స్థాపించారు. దీని ద్వారా శాస్త్రసభలు నిర్వహించేవారు. ఆ సమయంలో అద్వైతసిద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఈ గ్రంథాన్ని బోధించేవారు ఎక్కువ మంది జీవించి లేరని, గ్రంథ ఆధ్యయనం, అధ్యాపకులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టకపోతే అది అంతరించిన గ్రంథాల జాబితాలోకి చేరిపోతుందంటూ తమిళనాడుకు చెందిన వేద పండితుడు బోడా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం తెనాలిలో పాఠశాల ఏర్పాటుచేసి ఈ గ్రంథాన్ని బతికించాలని పండితుల సభ సూచించింది.
అద్వైతసిద్ధి గ్రంథాన్ని నాలుగు సెమిస్టర్లతో రెండేళ్ల కోర్సుగా నిర్వహించేలా తొలుత సిలబస్ సిద్ధమైంది. కాలక్రమంలో దీన్ని మొత్తం 4 కోర్సులుగా విభజించారు. వాటిలో తర్వం 6 సంవత్సరాలు, వ్యాకరణ, మీమాంసలు ఒక్కొక్కటి ఏడేళ్లు చొప్పున, వేదాంత శాస్త్రం ఆరున్నర సంవత్సరాలు అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వీటిని చదివే సమయంలోనే సెమిస్టర్ల వారీగా పరీక్షలు ఉంటాయి. ఏ విద్యార్థి అయినా వరుసగా రెండుసాళ్లు ఉత్తీర్ణత సాధించకుంటే అతను ఇక పై ఆ శాస్త్రం చదవడానికి అనర్హుడుగా నిర్ణయిస్తారు. ప్రతిసారీ మౌఖిక పరీక్షలో కనీసం 50%, రాత పరీక్షలో 50% మార్కులు తప్పనిసరి, ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షలుంటాయి.
ప్రావీణ్యం ఉన్నవారికి మా వ్యాకరణ, వేదాంతాదుల్లో కఠిన శిక్షణ
సెప్టెంబరు నాలుగు విభాగాలుగా కోర్సు విభజన ఏటా మూడుసార్లు తెనాలిలో పరీక్షలు రెండుసార్లు తప్పితే కోర్సుకు అనర్హత దేశం నలుమూలల నుంచి అభ్యర్థులు మాత్రం ముందుగానే కోర్సు పూర్తి చేసేలా మార్చిలోనూ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఏ విద్యార్థి పరీక్ష రాయాలన్న తెనాలి రావాల్సిందే. దక్షిణాది రాష్ట్రాలతో పాటు హరియాణా, కోల్ కతా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, డిల్లీ, గుజరాత్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడి పాఠశాలలో విద్యను అభ్యసిస్తారు. ఒక్కో కోర్సు పూర్తయ్యాక వాటిలో స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుంది. వ్యాకరణంలో నవాన్నీకం చదివిన వారికి ఆ తర్వాత ‘అష్టాధ్యాయం’ ప్రత్యేక కోర్సు ఉంటుంది. ఇది పూర్తిచేయడం చాలా కష్టమని చెబుతారు.
ఏడేళ్ల వ్యాకరణ శాస్త్రం కోర్సును నాలుగేళ్లలోనే పూర్తిచే సిన మహారాష్ట్రబాలుడు ప్రియ వృత దేవదత్త పాటిల్ మరో మూడేళ్లు ఈ కోర్సు చేసేందుకు సిద్ధపడుతున్నాడు. కర్ణాటకలోని శృంగేరి పీఠం సమీప గ్రామానికి చెందిన మహేశ్ గణ పతి భట్ త్వరలో ఇదే పరీక్ష రాయనున్నాడు. అందు లో ఉత్తీర్ణుడయితే దేశంలోనే ఈ కోర్సు చేసిన మనా పాటి ఇతనే అవుతాడు. వేదాంత శాస్త్రంలో శంకర భాష్యంతో కలిపి భామతి, కల్పతరు, పరిమళ వ్యాఖ్యానాలతో మూడేళ్ల స్పెషలైజేషన్, షడంగ సహిత విద్యా రణ్య భాష్యంలోనూ ఆరున్నరేళ్ల స్పెషలైజేషన్ ఉంటుంది. వీటిని పూర్తిచేయడం అరుదైన విషయమే. ఇన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 88మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష ఎంత కఠినమో అర్థమవుతుంది, గడువులోపు ఒక కోర్సు ముగించడమే కష్టమైతే, ఇక విభాగాలూ పూర్తి చేసిన వారు ఒక్కరూ లేకపోవటం కఠినత్వానికి నిదర్శనం.
తండ్రి రెండున్నరేళ్లలోనే…
మహారాష్ట్ర బాలుడు ప్రియవృత 16సంవత్సరాల వయసులోనే వ్యాకరణ శాస్త్రం పూర్తి చేయగా, ఆయన తండ్రి దేవదత్త గోవిందపాటిల్ ఇదే కోర్చును కేవలం రెండున్నరేళ్లలోనే ఉత్తీర్ణత సాదించడం విశేషం. ఈయన కూడా తెనాలిలోనే చదువుకున్నారు. తెనాలి పరీక్ష, ఇక్కడి పాఠశాల గురించి మరో గురువుకృషిని కొనియాడుతూ కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని పత్రికలు వ్యాసాలను ప్రచురించాయి. అయితే ప్రియ వృతకు ప్రధాని మోదీ ప్రశంసలు అందించిన కొద్దిసేప టికే అతని గురువు ఆంజనేయశాస్త్రి వివరాలు, ఫొటోలను పంపాలంటూ పాఠశాలకు పీఎంవో నుంచి ఫోన్ లో సమాచారం అందింది. ఇదిలాఉంటే, అద్వైతసిద్ధి గ్రంథాన్ని అభ్యసించి, ఉత్తీర్ణులయిన 8 మంది పండితులు రాష్ట్రపతి పురస్కారాలను సైతం అందుకున్నారు. అనేకమంది ఉన్నత పదవుల్లో, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కంచి పీఠం సహకారంతో
మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సుధర్మ రక్షణ పరిషత్ను 2006లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనలతో కంచి వేద వేదాంత శాస్త్ర సభగా మార్చారు. ఈ పీఠంతో పాటు హైదరాబాద్ కు చెందిన ఇండిక్ ఆకాడమీ అందిస్తున్న ఆర్థిక సహకారంతో తెనాలి పరీక్షలు, శిక్షణ నిర్వహిస్తున్నారు. శిక్షణకు నెలకు రూ.1.20ల క్షలు, పరీక్ష ఒకసారి నిర్వహించడానికి రూ.3లక్షల వరకు ఖర్చవడంతో దీనికి భారీగానే ఆర్థికసాయం అవసరం. పరీక్ష రాయడానికి దేశం నలుమూలల నుంచి తెనాలి వచ్చే విద్యార్థులకయ్యే ప్రయాణ, వసతి ఖర్చులు మొత్తం శాస్త్ర సభే భరిస్తుంది. యజ్ఞ యాగాదుల నిర్వహణ వంటివాటిపైనా ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి.