News

డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కొనుగోలుకు వాయుసేన నిర్ణయం

818views

సరిహద్దుల్లో డ్రోన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది.

ఈ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థలో లేజర్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని, దానిని దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలను వివిధ స్థావరాల్లో మోహరించాలని వైమానిక దళం తీర్మానించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.