News

రాజస్థాన్ : 22 ఏళ్ల గర్భిణిపై ఆంబులెన్స్ లో అత్యాచారం

846views

22 ఏళ్ల గర్భిణీ పై గర్భిణిపై అంబులెన్స్ లో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది.

అంబులెన్స్ లో వెళుతున్న బాధితురాలు తాను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, తనకు ఏదైనా ఆహారం ఇప్పించమని అంబులెన్స్ డ్రైవర్ ని కోరింది. దాంతో ఆంబులెన్స్ డ్రైవర్ సురేంద్ర ఆమెను వాహనంలోనే ఉండమని, ఆమెకు కావలసిన ఆహారాన్ని తాను తీసుకొస్తానని చెప్పి, ఆమెను అంబులెన్స్ లోనే ఉంచి తాను కిందికి దిగాడు. తన స్నేహితుడు మహేంద్రకు ఫోన్ చేసి అంబులెన్స్ వద్దకు రప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను సమీపంలోని ఒక ఆసుపత్రి వద్ద వదిలి పారిపోయారు.

స్యయంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారే రాజస్థాన్ హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలి భర్త తోపుడు బండిపై కూరగాయలమ్ముకుంటూ జీవిస్తుంటాడు. జూన్ 8వ తారీఖు నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతుండడంతో అతను తగిన పని లేక, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నాడు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు బాధితురాలికి, 500 రూపాయల నగదు, ఒక కేజీ నెయ్యి ఇస్తానని, ఆమె నోరు విప్పకుండా ఉండాలని చెప్పాడు. పట్టపగలే, రాష్ట్ర రాజధానిలోనే ఒక గర్భిణిపై అత్యాచారం జరగడం…. పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి కేసు విచారిస్తున్నారు.

Source : Organiser

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.