News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

913views

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు మరియు ముస్లిములకు కంటిమీద కునుకు కూడా ఉండడంలేదు. ఆయన వారికి కంటిలోని నలుసులా మారారనే చెప్పవచ్చు.

బైక్ పై వెళుతున్న ప్రదీప్ ను ఒక ట్రక్ వెనకనుంచి వేగంగా ఢీకొట్టింది. కమ్యూనిస్టులకు, ఇస్లామిస్టులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రదీప్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాన మీడియా ఏమాత్రమూ ఆసక్తి చూపకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో, అదీ కమ్యూనిస్టులకు, ముస్లిం మతోన్మాదులకు మింగుడుపడని జర్నలిస్టు మృతి కనుక మీడియా దీనిపై ఉత్సాహం ప్రదర్శించడం లేదని, అదే ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనో ఇలాంటి ఘటన జరిగి ఉంటే మీడియా స్పందన మరోలా ఉండేదని పలువురు విమర్శిస్తున్నారు.

కేరళ గోల్డ్ స్కాంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సహా, ఆయన బంధువులు, సన్నిహితులు, పార్టీ ప్రముఖులు పలువురు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.