
538views
కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్లు నిర్మించాలని తితిదే నిర్ణయించింది. కరోనా చికిత్సల కోసం రాష్ట్రంలో 22 షెడ్లు ఏర్పాటు చేసేందుకు రూ.3.52కోట్లు మంజూరు చేస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, కర్నూలులో 2, కృష్ణాలో 3, గుంటూరులో 3, కాకినాడలో 3, ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లను ఏర్పాటు చేయనున్నారు. షెడ్లు నిర్మించేందుకు కలెక్టర్లకు తితిదే నిధులను అందించనుంది. ఒక్కో షెడ్‌లో 30 ఆక్సిజన్ పడకలు ఏర్పాటుకు అవకాశముంది. ఇప్పటికే తిరుపతి స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి వద్ద షెడ్‌ను ఏర్పాటు చేశారు.





