వీడియో : కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమెలా? వెంటనే చూడండి “ఆరోగ్యభారతి వారి అమూల్యమైన సూచనలు”

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ ఆరోగ్యభారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు మూడు వీడియోలను విడుదల చేశారు. ఆరోగ్య భారతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి శ్రీనివాస రావు గారు ఆ వీడియోలలో అనేక విషయాలను వివరించారు. ఆ వివరాలేమిటో వారి మాటల్లోనే తెలుసుకుందాం……
మొదటి వీడియోలో…. వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి? వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ప్రయోజనాలేమిటి? వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా? వ్యాక్సిన్ విషయంలో వస్తున్న పలు వార్తలు, వదంతులు నిజమేనా? వాటిని నమ్మవచ్చా? అనే విషయాలను డాక్టర్ గారు వివరించారు. ఆ విషయాలను తెలుసుకుందాం…… అవగాహన పెంచుకుందాం……
అలాగే రెండవ వీడియోలో కోవిడ్ వచ్చినవారు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? కోవిడ్ వచ్చినా వ్యాధి లక్షణాలు లేనివారు ఏ విధంగా వ్యాధి వ్యాప్తికి దోహదపడుతున్నారు? అలాంటి ప్రమాదం జరగకుండా వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను వివరించారు. ఒకసారి ఆ వివరాలేమిటో తెలుసుకుందాం…… జాగ్రత్తగా మసలుకుందాం…..
ఇక మూడవ వీడియోలో కోవిడ్ సెకండ్ వేవ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? తదితర విషయాలను డాక్టర్ గారు సవివరంగా తెలియజేశారు. ఆ అద్భుత సందేశాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం…… పదుగురికీ తెలుపుదాం……