News

తిరుమ‌ల‌లో ముగిసిన విశాఖ శార‌దాపీఠం ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర

816views

విశాఖ జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల నుంచి వ‌చ్చిన 1200 మందికి పైగా గిరిజ‌నులు, ద‌ళితుల‌తో క‌లిసి తిరుమ‌ల పిఏసి-3 నుంచి పాద‌యాత్ర‌గా వెళ్లి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

ద‌ర్శ‌నానంత‌రం నాద‌నీరాజనం వేదిక‌పై జ‌రిగిన భ‌జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక పుస్త‌కాలు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర‌స్వామి మీడియాతో మాట్లాడారు. హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించి మ‌తమార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు గిరిజ‌న ప్రాంతాల్లోని హిందువుల‌ను చైత‌న్య‌ప‌ర‌చ‌డం కోసం 2019లో హిందూ ధ‌ర్మ ప్ర‌చార యాత్ర ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 33 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా మారుమూల ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌కు హిందూ మ‌తం ఔన్న‌త్యాన్ని వివ‌రించిన‌ట్టు చెప్పారు.

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో యాత్ర ముగించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

1200 మందికిపైగా గిరిజ‌నులు, ద‌ళితుల‌తో కలిసి స్వామివారిని ద‌ర్శించుకుని హిందూ ధ‌ర్మ వ్యాప్తికి త‌గిన శ‌క్తిని ఇవ్వాల‌ని ప్రార్థించిన‌ట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.