
800views
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది భాజపా. ఆమెను ఎంపిక చేయటంపై స్థానిక భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి, ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కలితా. కలితా భర్త సుబ్రతా మజ్హీ.. ఓ ప్లంబర్. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి… ”కాలి గాయంతో మమత ఎన్నికల ఆటను ఎలా ఆడతారు” అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధించారు.





