
519views
భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌక చేరడానికి రంగం సిద్ధమైంది. వి.సి.11184 పేరుతో నిర్మాణమై ‘ధ్రువ్’ పేరుతో ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న ఈ సముద్ర నిఘా యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో అత్యంత రహస్యంగా ఐదు సంవత్సరాల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి వినియోగిస్తున్నారు. నూతన యుద్ధనౌకలకు సాధారణంగా నిర్వహించే ప్రారంభోత్సవ వేడుకలేవీ దీనికి జరగలేదు. కొద్దినెలల్లో అధికారికంగా నౌకాదళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.





