
636views
ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ శ్రీ శ్రీకృష్ణ మోతలాగ్ 2020 ఆగస్టు 2 న నాగ్‌పూర్‌లో రాత్రి 8.42 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 86. బెంగాల్‌లో సంఘ కార్యకలాపాలను నిర్మించడంలో శ్రీ మోతలాగ్ చేసిన కృషి చిరస్మరణీయమైనది.
1962 లో, తన ఇంజనీరింగ్ చదువు పూర్తయిన తరువాత శ్రీ మోతలాగ్ RSS ప్రచారక్ గా దేశసేవకు అంకితమయ్యారు. ప్రారంభంలో ఆయన అస్సాంలో ప్రచారక్‌గా చాలా సంవత్సరాలు పనిచేశారు. తరువాత నాగ్‌పూర్ ప్రాంత్ ప్రచారక్‌గా పనిచేశారు. తదనంతరం, ఆయన బెంగాల్ ప్రాంత ప్రచారక్ గానూ ఆ తరువాత ఈశాన్య క్షేత్ర ప్రచారక్ గానూ పని చేశారు. అనంతరం ఆయన చాలా సంవత్సరాలు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ సహ ప్రచారక్ ప్రముఖ్‌గా కూడా బాధ్యత నిర్వర్తించారు. గత కొన్నేళ్లుగా శ్రీ మోతలాగ్ నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యలయం డాక్టర్ హెడ్గేవర్ భవన్‌లో ఉంటున్నారు.
Source : Organiser





