
భారత్-చైనా సైనిక లేదా ఆర్థిక వివాదాల్లో భారత్‌కే అమెరికా మద్దతు ప్రకటించాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న నిర్వహించిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు భాగస్వాములు అయ్యారు.
ఆసియాలో అతిపెద్ద రెండు దేశాల మధ్య సైనిక వివాదం తలెత్తితే 63.5%, ఆర్థిక వివాదమైతే 60.6% మంది ఎవ్వరికీ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అయితే డ్రాగన్‌తో పోలిస్తే ప్రత్యేకంగా భారత్‌కు మద్దతిస్తున్నవారి సంఖ్య భారీగా ఉండటం గమనార్హం.
‘భారత్, చైనా మధ్య సైనిక వివాదం తలెత్తితే 32.6% మంది అమెరికా పౌరులు భారత్‌కే అండగా నిలవాలని కోరుకున్నారు. 3.8% మంది మాత్రమే చైనాకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక వివాదమైతే 36.3% మంది దిల్లీకి, 3.1% మంది బీజింగ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఇవ్వాలని ఓటేశారు’ అని సర్వే పేర్కొంది.
సరిహద్దుల అంశంలో అన్ని పొరుగు దేశాలతో డ్రాగన్‌కు వివాదాలు ఉండటం, హాంకాంగ్ స్వేచ్ఛాహరణ, తైవాన్‌పై ఒత్తిడి కారణంగా అమెరికన్లు భారత్ వైపు ఉంటున్నారని సర్వే తెలిపింది. చైనాతో అనేక అంశాల్లో భారత్, అమెరికా అధికారులకు సవాళ్లు ఎదురవ్వడంతో వారు భారతీయులపై సానుభూతి చూపిస్తున్నారని వెల్లడించింది.





