
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్‌లాక్ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవ్వడానికి గల కారణాలపై గవర్నర్ ఆరా తీశారు. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడాన్ని ప్రశంసించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారి వల్లే కేసులు పెరుగుతున్నాయని సీఎస్, గవర్నర్‌కు వివరించారు. కొవిడ్ బాధితులకు ఆస్పత్రుల సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. కేసులు 10 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి వివరించారు. నమూనాలు తీసిన 24 గంటల్లోనే ఫలితాలు వచ్చేలా జాగ్రత్తలు పడుతున్నామని చెప్పారు.





