News

పాకిస్తాన్లో ఇద్దరు విధులలో వున్న ఇండియన్ హైకమిషన్ సిబ్బంది మాయం

662views

పాకిస్తాన్లోని ఇద్దరు విధులలో వున్న భారత హైకమిషన్ సిబ్బంది గత 5 గంటలుగా తప్పిపోయినట్లు సమాచారం. పాకిస్తాన్‌లో తప్పిపోయిన సిబ్బంది గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వబడింది. ఈ విషయంపై భారత అధికారులు పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నారు.

పాకిస్థాన్‌లో భారత హై కమీషన్ సిబ్బంది వున్నభారతీయ వాహనం గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఉదయం నుంచి తప్పిపోయిన ఆ వాహనంలో హైకమిషన్ సిబ్బందిలో ఇద్దరు ఉన్నారని చెప్పారు.

ఒక వారం క్రితం, భారతదేశానికి చెందిన ఛార్జ్ డి అఫైర్స్ గౌరవ్ అహ్లువాలియా యొక్క వాహనాన్ని ఐఎస్ఐ సభ్యుడు ఒకడు వెంబడించాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ భారత దౌత్యవేత్త నివాసం వెలుపల కార్లు మరియు బైకులలో పలువురు వ్యక్తులను నిలబెట్టింది. ఇద్దరు పాకిస్తాన్ హైకమిషన్ అధికారులను గూఢచర్యం కేసులో భారతదేశంలో పట్టుకుని, విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ‘పర్సనల్ నాన్ గ్రాటా’ గా ప్రకటించిన కొద్దిసేపటికే ఇది జరిగింది. దీని తరువాత, ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారిక రహస్యాలు చట్టం 1923 కింద దాఖలు చేసిన కేసును చురుకుగా పరిశీలిస్తోంది, ఇది గూఢ చర్యం, విధ్వంసం మరియు సంబంధిత నేరాలకు సంబంధించినది.

Source : Republic World

https://www.republicworld.com/india-news/law-and-order/two-indian-high-commission-officials-in-pakistan-missing-since-last-tw.html?utm_source=izooto&utm_medium=push_notifications&utm_campaign=IndianStaffersMissing&utm_content=&utm_term=

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.