News

పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత సైనికుడు వీరమరణం

855views

పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెలలో పాక్‌ సైనిక కాల్పుల్ని తిప్పికొట్టే క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులు కావడం విచారకరం. ఇంతకుముందు జూన్‌ 4న ఓ హవల్దార్‌, జూన్‌ 10న ఓ నాయక్‌ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో పాక్‌ వైపు ఎంత మంది మృతిచెందారన్నది ఇంకా తెలియరాలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.