
మసీదులో ఆజాన్ (ముస్లింల ప్రార్ధన)ను లౌడ్ స్పీకర్స్ ద్వారా చెప్పడం ఇస్లాంలో అంతర్భాగమని చెప్పలేమని శుక్రవారం నాడు అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆజాన్ కోసం ధ్వని యంత్రాల వాడకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ హక్కు) కింద సమర్ధింపబడదని కోర్టు అభిప్రాయపడింది.
పరికరాల వాడకం అనేది భారత రాజ్యాంగంలోని పార్ట్ III లోని ప్రజా క్రమం, ఆరోగ్యం, నైతికత మరియు ఇతర నిబంధనలక క్రిందకు వస్తుందని జస్టిస్ శశి కాంత్ గుప్తా మరియు జస్టిస్ అజిత్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్, అభిప్రాయపడింది.
కరోనావైరస్ లాక్డౌన్ వేళ అజాన్ పఠనాన్ని పరిమితం చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించిన దరిమిలా ఎంపి అఫ్జల్ అన్సారీ, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, మరియు న్యాయవాది ఎస్ వాసిమ్ ఎ ఖాద్రి లు అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ పఠనం చెయ్యడం ఇస్లాం మతం యొక్క అంతర్భాగమని, కనుక అందుకు అనుమతించమని వారు కోర్టును అభ్యర్ధించారు.
అజాన్‌పై అలహాబాద్ హెచ్‌సీ ఉత్తర్వు
“అందువల్ల, శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల నుండి లైసెన్స్ లేదా అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ, ధ్వని-విస్తరించే పరికరాల ద్వారా అజాన్ పారాయణం చేయకూడదు.” అవసరమైన అనుమతులు లేకుండా అలా చేయడం, శబ్ద కాలుష్య నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. తీర్పును మే నెల ప్రారంభంలో 5 వ తారీఖున రిజర్వు చేసిన కోర్టు, ఇస్లాం మతం యొక్క అంతర్భాగమైనందున లాక్డౌన్ సమయంలో అజాన్ పఠనానికి అడ్డంకి కలిగించవద్దని జిల్లా యంత్రాంగాన్ని కోరింది.
కోర్టు ఏం చెప్పిందంటే…
“ఆజాన్ ను ఇస్లాం యొక్క అంతర్భాగంగా భావించవచ్చు, కాని లౌడ్ స్పీకర్లు లేదా ఇతర ధ్వని-విస్తరించే పరికరాల ద్వారా అజాన్ పారాయణం మతం యొక్క అంతర్భాగమని చెప్పలేము. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణకు ఇది అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 లో పొందుపరచబడిన ఇది ప్రజా జీవనం, నైతికత లేదా ఆరోగ్యాలకు సంబంధించినది. రాజ్యాంగంలోని III వ భాగంలోని నిబంధనలకు లోబడి వుంది.” అని పేర్కొంది.
Source : OPINDIA





