NewsSeva

ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ఆరెస్సెస్

2.2kviews

నసంక్షేమ సమితి, సేవాభారతి మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడం తప్పనిసరి అయినది. దీనివలన ఎందరో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మన ప్రధాని 24 మార్చి 2020 రాత్రి లాక్ డౌన్ ప్రకటించగానే 25,26 తేదీలలో పనులు లేక, ప్రయాణాలు చేయలేక పస్తులుండవలసిన పరిస్థితి ఎందరికో ఏర్పడింది.

ప్రభుత్వ పాలనా యంత్రాంగం మరియు పోలీసు వారి సూచనలు, అనుమతులు పొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్వయంసేవకులు ఇటువంటి బాధితుల సహాయార్థం హుటాహుటిన రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

అందిన సమాచారం ప్రకారం మార్చి 25, 26వ తేదీలలో లాక్ డౌన్ బాధితుల సేవలు :

* గూడూరు మున్సిపల్ అధికారుల సూచన మేరకు ముఖ్యమైన సేవలందించిన సిబ్బందికి మాస్కులు వితరణ చేసారు. రోజువారీ కూలీలు మరియు నిరాశ్రితులకు రోజుకు 200 మందికి ఆహారం సరఫరా చేస్తున్నారు.

* మార్కాపురంలో ఒడిస్సా నుండి వచ్చి బి.ఇ.డి. చదువుతున్న 40 మంది విద్యార్థులకు వసతి, భోజనం, తిరుగు ప్రయాణానికి పోలీసువారి ద్వారా ఏర్పాట్లకు సహాయం అందించారు.

* ప్రకాశం జిల్లా గుడ్లూరులో 30 యానాదుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు.

* తెనాలిలో ప్రయాణాల మధ్య ఇక్కట్లపాలైన ప్రయాణీకులకు 100 మందికి భోజన వితరణ చేసారు. పోలీసు వారికి తేనీరు అందజేశారు.

* కడప లో 50 మంది నిరాశ్రితులకు ఆహారమందించారు.

* గాజువాకలో రాత్రి గస్తీ చేసే పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి తేనీటి ఏర్పాట్లు చేస్తున్నారు.

* విశాఖ జిల్లా అరిలోవకు వచ్చి చిక్కుకుపోయిన బీహారీలకు వసతి, భోజన ఏర్పాటు చేశారు.

* విజయవాడ, సింగ్ నగర్, ఉడాకాలనీలోని వృద్ధులు మాత్రమే ఉన్న 30 కుటుంబాలకు వారం సరిపడా కూరగాయలు అందించారు.

* రాజమండ్రి నగరంలో  ఆరెస్సెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు.

* సేవా భారతి, మచిలీపట్నం వారు పోలీసు డ్యూటీ చేస్తున్న సిబ్బందికి, మీడియా మిత్రులకు  వాష్ బుల్ మాస్క్ లు, చేతి గ్లౌజులు జిల్లా పోలీసు SP గారి ఆధ్వర్యంలో 100 మందిక పోలీసు సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యకర్తలు దాతలు పాల్గొన్నారు.

* తూ. గో జిల్లా, ముమ్మిడివరం మండలం, చినకొత్త లంక లోని నిరు పేద కుటుంబాలకు సేవా భారతి కార్యకర్తలు నిత్యావసర వస్తువుల వితరణ చేశారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కావలసిన వారికి మెడిసిన్స్ అందిస్తున్నారు. అందరూ ఇంటిలోనే ఉండాలని సూచిస్తున్నారు.

* నెల్లూరులో ఈరోజు పోలీసు వారికి RSS ( శ్రీకృష్ణదేవరాయ శాఖ ) బాగ్ 2  వారి తరుపున భోజనం ఇవ్వడం జరిగింది.

* కర్నూలు జిల్లా నంద్యాలలో కూడా కార్యకర్తలు పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, ఇతర అత్యవసర విభాగాలలో పనిచేసే వారికి ఆహార పొట్లాలు అందించారు.

ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆరెస్సెస్, సేవాభారతి కార్యకర్తలు తమ సేవలను అందిస్తున్నారు.

బొబ్బిలి జిల్లా పార్వతీపురంలో…..

ఏలూరులో…..

అన్ని జిల్లాల్లోనూ జన సంక్షేమ సమితి, సేవాభారతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రభుత్వ మరియు పోలీసు యంత్రాంగాన్ని కలిసి అన్ని రకాల సేవలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి ప్రజావసరాలకైనా తమ సేవలను వినియోగించుకోవచ్చునని విజ్ఞప్తి చేశారు.

దేశమంతా సంపూర్ణంగా లాక్ డౌన్ లో ఉన్న దరిమిలా రాబోవు రోజుల్లో వివిధ రకాల సేవా అవసరాలు రావచ్చు. స్వయం సేవకులు అవసరమైన వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, పోలీసువారి నియమాలు పాటిస్తూ సహాయ కార్యక్రమాలు చేయడానికి సన్నద్ధంగా ఉండాలని జన సంక్షేమ సమితి అధ్యక్షులు, రాష్ట్ర్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత సంఘచలక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు కార్యకర్తలను కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.