News

గురుద్వారాపై ఉగ్రదాడిలో కేరళ జీహాదీ హస్తం

689views

కాబూల్‌లోని సిక్కు గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడి వెనుక కేరళకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అబూ ఖలీద్ అల్-హిందీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 25 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఆన్‌లైన్ వార్తా సంస్థ ఖామా ప్రెస్ దీనిని ద్రువీకరిస్తోంది. ఇస్లామిక్ స్టేట్ యొక్క శాఖ అయిన ఐసిస్ ఖోరాసన్ యొక్క అధికారిక వార్తా సంస్థ “ది అమాక్ న్యూస్ నుండి” ఆ వార్తా సంస్థ ఈ సమాచారాన్ని తీసుకుంది.

ఐసిస్ బుధవారం కాబూల్ నగరంలోని సిక్కు ఆలయంలోకి చొరబడిన ఆత్మాహుతి బాంబర్ ఫోటోను విడుదల చేసింది.

అతనిని కేరళలోని వలపట్టణం ఐఎస్ క్యాంప్ కేసులో నిందితుడైన అబూ ఖలీద్ అల్-హిందీ అకా అబ్దుల్ ఖయూమ్ గా భావిస్తున్నారు. ఐఎస్ లింకుల ఆరోపణలపై కన్నూర్ జిల్లాలోని వలపట్టణం నుంచి అబూ ఖలీద్‌తో సహా ఐదుగురిపై ఎన్‌ఐఏ 2017 లో కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ ప్రకారం, అబూ ఖలీద్ సిరియాలో ఉన్నట్లుగా .

సిక్కు సమాజమే తమ లక్ష్యమని ఉగ్రవాద సంస్థ క్లుప్త ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్లో మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2018 మధ్యలో జలాలాబాద్ నగరమైన నంగర్‌హార్‌లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో సిక్కు వర్గానికి చెందిన అనేక మంది సభ్యులతో సహా కనీసం 19 మంది మృతి చెందినట్లుగా ఐసిస్ ఖోరాసన్ పేర్కొన్నది.

Source : Indusscrolls.

https://indusscrolls.com/kerala-is-terrorist-behind-kabul-gurdwara-blast-that-killed-27-sikhs/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.