
విజయవాడలోని అయోధ్యనగర్ లో జరిగే ప్రహ్లాద శాఖా వార్షికోత్సవం ఈ రోజు ఉదయం అయోధ్యనగర్ లోని క్షత్రియ సేవా సంఘం వారి క్షత్రియ భావన్లో జరిగింది. ఈ వార్షికోత్సవంలో రోజూ శాఖకు వచ్చే బాల స్వయంసేవకులు, ప్రౌఢ, తరుణ స్వయంసేవకులు మొత్తం 30 మంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విజయవాడ మహానగర్ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యక్తులలో సంస్కారాలను నింపి వారిని దేశభక్తులుగా తీర్చిదిద్దడానికే డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ప్రారంభించారని, ప్రతి రోజూ శాఖలో పాల్గొని శాఖలో నేర్పే శారీరిక, బౌద్ధిక విషయాలను సాధన చేస్తే ప్రతి వ్యక్తీ శారీరిక మానసిక వికాసాన్ని పొందడం తోపాటు దేశభక్తిని, జాతీయభావనను, నేతృత్వ లక్షణాలను సహజంగా పొందగలుగుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్ 2 కార్యవాహ శ్రీ లక్ష్మణరాజు పాల్గొన్నారు. ముఖ్య శిక్షక్ గా శ్రీ హనుమాన్ వ్యవహరించారు.





