
573views
సింహపురి వైద్య సేవా సమితి మరియు యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 11వ తేదీ న గొలగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు జరగబోవు శ్రీవెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమం యొక్క గోడ పత్రిక ,కరపత్రములు మరియు స్వామి వారి స్టికర్స్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం జయాభారత్ హాస్పిటల్ నందు జరిగినది. ఈ కార్యక్రమం లో దత్తాత్రేయ పీఠాదిపతి శ్రీ శ్రీశ్రీ దయానంద స్వామి, శ్రీ శేషయ్య స్వామి, శ్రీ మునుస్వామి, సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ పొన్నలూరి సీతారామి రెడ్డి, RSS ప్రాంత ప్రచార ప్రముఖ శ్రీ బయ్యా వాసు, SSF రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోట సునీల్, విభాగ్ సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరికుమర్ రెడ్డి, యానాది ధర్మ జాగరణ వేదిక నాయకులు శ్రీ ఈగ రామయ్య, శ్రీ పోట్లూరి శ్రీనివాసులు, జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ పాల్గొన్నారు.








