News

ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్

564views

శాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ అంకిత్‌శర్మ మరణించే కొంతసమయం ముందే అయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 27న ఢిల్లీలోని చాంద్‌బాగ్‌ ప్రాంతంలో ఓ కాలువలో అంకిత్‌ శర్మ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, అత్యంతదారుణంగా జరిగిన ఈ హత్యలో స్థానిక నేత తాహిర్‌ హుస్సేన్‌ హస్తం ఉందంటూ అంకిత్‌శర్మ కుటుంబీకులు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో తాహిర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.