
నెల్లూరులోని మహమ్మద్ షమి అనే ముస్లిం నాయకుడు CAA, NRC, NPR గురించి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ, లేని పోని అపోహలు సృష్టిస్తూ, వారిని భయాందోళనలకు గురి చేస్తూ వీటంతటికి కారణం ప్రధాని మోడీ గాడు అని, వాడిని చెప్పుతో కొట్టాలని, తాను అమర్యాదగా మాట్లాడటమే కాకుండా ప్రజలు కూడా అదే విధంగా మాట్లాడేలా వారిని ప్రేరేపిస్తూ ఊరూ వాడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని, ఇతను నిర్వహిస్తున్న ప్రచారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఉందని, కావున తగు విచారణ జరిపించి, వీలయినంత త్వరగా అతనిని పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి SI శ్రీ బాజిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పసుపులేటి శివశంకర్, శ్రీ పోలిశెట్టి వీరబ్రహ్మయ్య, శ్రీ బొగ్గవరపు భాస్కర్, శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి, బిజెపి యువనాయకులు శ్రీ మూలా బాలకృష్ణా రెడ్డి, శ్రీ మల్లం కొండారెడ్డి, శ్రీ లెక్కమనేని రాజేష్ నాయుడు, శ్రీ మనం హరీష్, శ్రీ గున్నం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







