News

ఢిల్లీ ఘటనలపై అత్యుత్సాహం ప్రదర్శించిన ఇరాన్‌ రాయబారికి భారత్‌ సమన్లు

828views

ఢిల్లీ ఘటనలపై ఇరాన్‌ విదేశాంగమంత్రి జవద్‌ జరీఫ్‌ చేసిన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగానికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఘటనలపై జరీఫ్‌ వ్యాఖ్యలు ‘అనుచితమని.. అంగీకరించలేనివని’ స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఘటనల్ని ఖండిస్తున్నామంటూ జరీఫ్‌ ట్విటర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇరాన్‌, భారత్‌ మధ్య శతాబ్దాల నుంచి మిత్రుత్వం కొనసాగుతోందని గుర్తుచేసిన ఆయన ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఘటనలపై పూర్తి అవగాహన లేకుండా ఇప్పటికే పాకిస్థాన్‌, ఇండోనేషియా, టర్కీ వ్యాఖ్యలు చేశాయి. వీటి సరసన ప్రస్తుతం ఇరాన్‌ కూడా చేరింది. ఢిల్లీ సహా ఇతర ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దని గతవారం పలు దేశాలతో పాటు ఐరాస మానవహక్కుల వంటి అంతర్జాతీయ సంస్థలకు భారత్‌ స్పష్టం చేసింది. అయినా తాజాగా ఇరాన్‌ మరోసారి ఈ వ్యాఖ్యల్ని చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.