NewsProgramms

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం

985views

భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలోనూ మరియు శ్రీ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనూ ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ రెండు కార్యక్రమాలలోనూ డి ఆర్ డి ఓ శాస్త్రవేత్త డాక్టర్ బి రామకృష్ణ పాల్గొని విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగమనంలో సైన్స్ పాత్ర అనే అంశాలపై ప్రసంగించారు. విద్యార్థులలో సైన్స్ పట్ల శ్రద్ధాసక్తులు కలిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని, అనాదిగా భారతీయ శాస్త్రవేత్తలు శాస్త్ర, విజ్ఞాన రంగాలలో విశేష కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు.

మోడల్ స్కూల్ లో….

ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీ విజేతలకు ట్రిపుల్ ఐటి DM  డాక్టర్ డి వి ఎల్ ఎన్ సోమయాజులు బహుమతి ప్రదానం చేసినారు. శ్రీ సోమయాజులు మాట్లాడుతూ భారతీయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక విషయాలను విశ్లేషించి విద్యార్థులు సైతం వివిధ విషయాలలో ప్రజ్ఞను సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన మండలి కన్వీనర్ డాక్టర్ ఆర్ మీనాక్షి రెడ్డి, సెక్రెటరీ శ్రీ పి నాగ విష్ణు, శ్రీ నాగరాజు, శ్రీ సత్య కమల్, శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.