News

ఢిల్లీ అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభం

761views

దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో బృందానికి నేర విభాగం అదనపు సీపీ బీకే సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. ఆ కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 130 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో ఆదివారం ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఇళ్లను తగలబెట్టడానికి పాల్పడటంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈక్రమంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది వరకు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.