News

6న ‘కాశీ-అయోధ్య యాత్ర’ ఆర్టీసీ ప్రత్యేక బస్సు

126views

పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సౌకర్యార్ధం ‘కాశీ-అయోద్య యాత్ర’ పేరిట రాజమహేంద్రవరం డిపో నుంచి ఆర్టీసీ ప్రత్యేక యాత్ర బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన కాశీవిశ్వేర్వునికి దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో అధికారులు చెబుతున్నారు. ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు ఇక్కడి డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే యాత్రలో భాగంగా 13 పుణ్య క్షేత్రాల్లో ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఈ యాత్రకు పుష్బ్యాక్ టుప్లస్టూ సీట్లు, టీవీ సౌకర్యం ఉన్న సూపర్ లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కరికి టికెట్ ఛార్జీ రూ.13 వేలుగా నిర్ణయించి నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె. మాధవ్ తెలి పారు. యాత్రలో భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. మార్గమధ్యలో ఎవరైనా విశ్రాంతి గదులు తీసుకోవాలను కుంటే దానికయ్యే అదనపు ఖర్చు మాత్రం భక్తులే భరించాల్సి ఉంటుంది. ఈ యాత్రకు వెళ్లదలచుకున్నవారు నాలుగురు కంటే ఎక్కువమంది ఉంటే వారి ఇంటివ ద్దకే వెళ్లి బస్సు టికెట్లు అందిస్తామని ఆర్టీసీ డిపో అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

దర్శించే క్షేత్రాలివి..
కాశీ-అయోధ్య యాత్రలో భాగంగా 13 క్షేత్రాల్లో ప్రముఖ దేవాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు.
•భువనేశ్వర్లోని లింగరాజస్వామి ఆలయం
• పూరీలో జగన్నాథస్వామి ఆలయం
• కోణార్క్
•కల్యాణిదేవి ఆలయం జాజ్పూర్లో గిరిజా
•త్రివేణి సంగమం కాశీలో కాశీవిశ్వేశ్వరస్వామి(జ్యోతిర్లింగం)
• కాశీఅన్నపూర్ణ, విశాలక్ష్మి(శక్తి పీఠం)
• అయోధ్యలో బాలరాముడు నూతన మందిరం
•గోమతి నదీస్నానం చక్ర దర్శనం, నైమిశారణ్యంలో తీర్థం, రుద్రావర్తం, లలితా దేవి(ఉపశక్తిపీఠం)
• గయలో విష్ణుపాద ఆలయం, మంగళగౌరీ ఆలయం(శక్తిపీఠం) బుద్ధగయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం
•అరసవిల్లిలో సూర్యనారాయణస్వామి ఆలయం శ్రీకూర్మంలో కుర్మనాథ దేవాలయం
• అన్నవరంలో రమాసత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.