News

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు

264views

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం తన 50 ఏళ్ల నిరంతర సేవలను పురస్కరించుకుని, ఫిబ్రవరి 1, 2026న స్వర్ణోత్సవ (50వ వార్షికోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించింది వ్యాధిగ్రస్తులకు చికిత్స, పునరావాసం మరియు సేవా కార్యక్రమాలతో ఈ కేంద్రం సుదీర్ఘ కాలంగా మానవసేవలో ముందుంటోంది

వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరులోని వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవ కార్యక్రమం కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్ష తన జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ అఖిల భారత భారతీయ సహ సర్ కార్యవాహ ముకుంద, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.

మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలసి పనిచేయాలని, ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ డ్రెయిన్ పనులను పుష్కరాలకు పూర్తి చేస్తామన్నారు. పర మేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆనంద స్వరూప్, ఆర్.కె.జైన్లు సాహిత్య సంస్థగా ఏర్పాటై సేవా మార్గంవైపు ప్రయాణించడం గొప్ప విషయమన్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్య కారిణి ఓలేటి సత్యనా రాయణ 20 పడకల ఆసుపత్రికి ఎంపీ పురందేశ్వరి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు, ఆనంద స్వరూప్ రూ.25 లక్షలు, కంబాల శ్రీనివాసరావు రూ.10లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. కామిని ప్రసాద్ చౌదరి, మత్సేటి ప్రసాద్, ప్రముఖులు పాల్గొన్నారు.